తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే తిరుపతికి 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వేసవి నెలల్లో ప్రయాణికులకు మరింత సౌలభ్యం మరియు సౌకర్యాన్ని అందించడమే ఈ ప్రత్యేక రైళ్ల లక్ష్యం.
ఈ మేరకు, మే 8 నుండి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెర్లపల్లి నుండి తిరుపతికి (07257) మే 9 నుండి 30 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుండి చెర్లపల్లి జంక్షన్ (07258) వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ ప్రత్యేక రైళ్లు సనత్‌నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూర్, రేణిగుంట స్టేషన్లలో మార్గమధ్యంలో ఆగుతాయని వెల్లడించారు.