సొంత ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే, హోం లోన్ తీసుకోవడం మంచిదా లేదా SIP ద్వారా పెట్టుబడి చేసి కొంటె బెటరా? అన్నదే ముఖ్యమైన ప్రశ్న.
ఇంటి ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇప్పుడు హోం లోన్ తీసుకోవడం మంచిదా? లేక 10-15 ఏళ్ల పాటు SIP ద్వారా పెట్టుబడి చేసి కొంటె మంచి లాభం వస్తుందా? ఈ రెండు మార్గాలను పరిశీలిద్దాం.
ఒకే లక్ష్యం – రెండు మార్గాలు
- ఒకవైపు హోం లోన్ – 15-25 ఏళ్ల హోం లోన్ తీసుకుని నెలకు EMI చెల్లిస్తూ సొంతింటిని పొందడం.
- ఇంకోవైపు SIP పెట్టుబడి – అదే EMI మొత్తాన్ని SIPలో పెట్టుబడి చేసి, కొన్ని ఏళ్లలో పెద్ద మొత్తాన్ని పోగు చేసుకోవడం.
ఈ రెండింట్లో ఏది మంచిది? లెక్కలు చెక్ చేసేద్దాం.
Related News
సినారియో 1: ₹65 లక్షల హోం లోన్ – 25 ఏళ్లకు EMI ప్లాన్
- లోన్ మొత్తం: ₹65 లక్షలు
- కాలవ్యవధి: 25 సంవత్సరాలు
- వడ్డీ రేటు: 9.5%
- EMI: ₹56,790
- మొత్తం వడ్డీ చెల్లింపు: ₹1,05,37,085
- మొత్తం తిరిగి చెల్లించాల్సిన మొత్తం: ₹1,70,37,085
- ఇంటి ప్రస్తుత ధర: ₹72 లక్షలు
ఫలితం: మీరు 25 ఏళ్ల పాటు హోం లోన్ EMI చెల్లించాలి. మొత్తం ₹1.70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
సినారియో 2: అదే EMIని SIPలో పెట్టుబడి చేస్తే?
- ప్రతినెలా పెట్టుబడి: ₹56,790
- సగటు రాబడి: 10% (సంవత్సరానికి)
- కాలవ్యవధి: 11 సంవత్సరాలు
- 11 ఏళ్లలో పెట్టుబడి మొత్తం: ₹74,96,280
- మొత్తం లాభం: ₹58,06,431
- సంపాదించిన మొత్తం: ₹1,33,02,711
అంటే 11 ఏళ్లలోనే మీ దగ్గర ₹1.33 కోట్లు పోగవుతుంది.
ఇంటి ధర 11 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుంది?
ఇంటి ధర సంవత్సరానికి 5% పెరుగుతుందని అంచనా వేస్తే,
ప్రస్తుత ₹72 లక్షల ఇల్లు, 11 ఏళ్లలో ₹1,23,14,443 అవుతుంది.
అంటే, SIP ద్వారా మీరు 11 ఏళ్లలోనే అవసరమైన మొత్తం పొగుచేసుకుని సొంత ఇల్లు కొనొచ్చు.
హోం లోన్ vs SIP – ఏది మంచిది?
✔ హోం లోన్ తీసుకుంటే – మీరు వెంటనే ఇంట్లో ఉండొచ్చు, కానీ 25 ఏళ్ల పాటు ఎక్కువ వడ్డీ కట్టాలి.
✔ SIP ద్వారా ఇంటి కోసం పొదుపు చేస్తే – 11-12 ఏళ్లలోనే తక్కువ ఖర్చుతో అధిక లాభంతో ఇల్లు కొనొచ్చు.
ముఖ్యమైన అంశాలు:
- మీ వయసు తక్కువగా ఉంటే SIP ఉత్తమం – మీరు 30-35 ఏళ్ల వయస్సులో ఉంటే, SIP ద్వారా పెద్ద మొత్తాన్ని పోగు చేసుకోవచ్చు.
- తక్కువ డౌన్ పేమెంట్ ఇస్తే వడ్డీ భారం పెరుగుతుంది – కనుక, ముందుగా ఎక్కువ డబ్బు పెట్టి ఇంటిని కొనడం ఉత్తమం.
- సొంతింటి అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి – ఇంటి అవసరం తక్షణమే ఉంటే, హోం లోన్ తీసుకోవచ్చు.
ఫైనల్ వెర్డిక్ట్
- మీరు తక్షణమే సొంతింటి అవసరం లేకపోతే, 11 ఏళ్ల పాటు SIP ద్వారా పెట్టుబడి చేయడం ఉత్తమ ఎంపిక.
- మీకు వెంటనే ఇల్లు కావాలంటే హోం లోన్ తీసుకోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఎక్కువ వడ్డీ చెల్లించాలి.
(Disclaimer: ఈ లెక్కలు సగటు మార్కెట్ వృద్ధిపై ఆధారపడి ఉంటాయి. ఖచ్చితమైన నిర్ణయానికి నిపుణుల సలహా తీసుకోండి.)