ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. చిన్న ఉద్యోగమైనా యువతకు ప్రభుత్వమే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ పరీక్షలను ఎదుర్కోవాలి.
పరీక్షల్లో ప్రతిభ చూపాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఇవన్నీ పాసైతేనే ఉద్యోగం వస్తుంది. అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారంటే శుభవార్త. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగాలు ఎంపిక చేయబడతాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ. 44,900 జీతం.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవోదయ విద్యాలయాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం 2024-25 అకడమిక్ సెషన్ కోసం హైదరాబాద్ రీజియన్‌లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కౌన్సిలర్‌ల ఖాళీలను భర్తీ చేస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాస్టర్ డిగ్రీ (MA/MSc)తోపాటు గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సుతో పాటు ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన సమాచారం:
పోస్ట్‌లు: కౌన్సిలర్
అర్హత: అభ్యర్థులు సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ (MA/MSc)తోపాటు గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సుతో పాటు ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి: 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ. 44900 జీతం.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2024