ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా
పత్రికా ప్రకటన (28.4.2025)
ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత నిర్బంధ ప్రవేశాల షెడ్యూల్ మార్పు
• పేద విద్యార్థులకు 25 శాతం ఉచితంగా సీట్ల కేటాయింపు మే 2 నుండి మే 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
విద్యాహక్కు చట్టం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 28 నుంచి జరగాల్సిన దరఖాస్తుల స్వీకరణ కొన్ని అనివార్య కారణాల వల్ల మే 2 నుండి మే 19వరకు మార్పు చేసినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు ఐఏఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డుసచివాలయాలడేటా ప్రకారం మే 20 నుండి మే 24 వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు. లాటరీ విధానంలో మొదటి విడత ఫలితాలను మే 29న విడుదల చేసి సీట్లు సాధించిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 8న ఖరారు చేస్తారు. రెండో విడత ఫలితాలను జూన్ 11న విడుదల చేసి, సీట్లు సాధించిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 18న ఖరారు చేస్తారు.
దరఖాస్తు విధానం ఇలా..
అర్హులైన విద్యార్థులు ప్రాథమిక వివరాలతో https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో మాత్రమే అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత చిరునామా కోసం దరఖాస్తుదారుల తల్లిదం డ్రుల ఆధార్, ఓటరు కార్డు, రేషను కార్డు, భూమి హక్కుల పత్రం, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్తు బిల్లు, అద్దె ఒప్పంద పత్రాల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు, పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.
IB, CBSE, ICSE సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మార్చి 31 నాటికి ఐదేళ్ల వయసు, స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు మే 31 నాటికి ఐదేళ్లు నిండిన పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చు.
రాష్ట్ర పథక సంచాలకులు
సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.