ప్రతి ఒక్కరికీ సొంత వాహనాలు ఉండడంతో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. సొంత వాహనాలు వాడే 10, 20 మంది ఒకే బస్సులో వెళితే ఎంత కాలుష్యం తగ్గుతుంది. ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని బస్సులు అందుబాటులో లేవు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 132 సీట్ల బస్సును ప్రస్తావించారు. విమానాల్లో సీట్లు, ఎయిర్ హోస్టెస్‌లు ఉన్నట్లే ఈ బస్సుల్లో కూడా సీట్లు, బస్ హోస్టెస్‌లు ఉంటారని వెల్లడించారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని గడ్కరీ తెలిపారు. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశం నుంచి ఎగుమతి చేసే దేశంగా భారత్‌ను మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే చాలా కంపెనీలు electric vehicles and flex fuel vehicles ప్రవేశపెడుతున్నాయని తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా 300 ఇథనాల్ పంపులను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజా రవాణా ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తుందని తెలిపారు.
ఒక కిమీ డీజిల్ బస్సు ప్రయాణానికి 115 రూపాయలు, AC electric bus cost రూ. 41, non AC electric bus cost రూ. 37. నిర్వహణ ఖర్చు తగ్గినప్పుడు టికెట్ ధరలు కూడా తగ్గుతాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసం ప్రస్తుతం టాటాతో కలిసి నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. యూరప్‌లోని చెక్ రిపబ్లిక్‌లో మూడు ట్రాలీ బస్సులను చూసిన నితిన్ గడ్కరీ.. భారత్‌లో కూడా అలాంటి బస్సులు ఉంటే బాగుంటుందని అన్నారు. రానున్న ఎలక్ట్రిక్ బస్సులో 132 మంది ప్రయాణించే వీలుంటుందని తెలిపారు. 40 సెకన్లలో 40 కి.మీ. ప్రయాణానికి కావల్సిన ఛార్జింగ్ అవుతుందని.. 35 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అదే జరిగితే టికెట్ ధరలు తగ్గుతాయి. అలాగే ఎక్కువ మంది ప్రయాణించే కొద్దీ కాలుష్యం కూడా తగ్గుతుంది.